నక్క - కోడిపుంజు

ఒక రోజున ఒక నక్క ఆకలితో మలమలమాడి పోతూ, ఎక్కడేనా ఏదైనా

తిండి దొరకవచ్చునని అంతటా వెతకుతోంది. అప్పుడు దానికొక కోడిపుంజు

కన్పించింది. కాని అది ఒక చెట్టుకొమ్మమీద కూర్చొని ఉంది.

దాన్ని చూడగానే,

Telugu Moral Stories

నక్కకు ఆకలి రెట్టింపైంది. ఏదో విధంగా ఆ పుంజును చంపి ఆకలి

తీర్చుకోవాలనుకొంది. మెల్లగా ఆ చెట్టువద్దకు వచ్చి “మిత్రమా! ఆకాశవాణి

నుండి నిన్న ఒక వార్త విన్పించింది. ఇకమీదట జంతువులన్నీ కలిసిమెలిసి

స్నేహితుల్లాగ జీవించాలట. అందుచేత క్రిందకురా! మనమిద్దరం స్నేహితుల్లాగ

మసులుకొందాం!" అంది.

ఆ జిత్తులమారి నక్క చెప్పేదాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెల్సు.

అందుచేత అది “అవును ఆ వార్త నేనుగూడా విన్నాను.” అంది. లోలోపల

కోడిపుంజు నక్కబారినుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తోంది. చివరకు

యిలా అంది. “అదిగో! నీ స్నేహితులెవరో యిటేవస్తున్నారు. వాళ్ళని గూడా

రానీ! అందరమూ కలిసి అప్పుడు పండుగ చేసుకొందాం!"

 “ఈ దారిన వచ్చే నా స్నేహితులెవరూలేరే! ఇంతకూ ఎవరొస్తున్నారు?"
అని అడిగింది నక్క

“వేటకుక్కలూ, వాటి స్నేహితులూ” జవాబిచ్చింది పుంజు.
వేటకుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణకడం మొదలెట్టింది.

“వాటి కంటబడితే చావడం ఖాయం” అనుకొన్నది నక్క
“అలా భయంతో వణకిపోతున్నావెందుకు?” అని అడిగింది కోడిపుంజు
అందుకు నక్క “వాళ్ళు బహుశా నిన్నటివార్త వినలేదేమో అనుకొంటా”
అంటూ పరుగెత్తి పారిపోయింది.

నీతి :- మోసాన్ని మోసంతోనే జయించాలి

Previous Post Next Post